For Money

Business News

ఒక రోజు పెట్రోల్‌ స్టాక్‌ ఉంది అంతే…: ప్రధాని

శ్రీలంక కొత్త ప్రధాన మంత్రి రణిల్‌ విక్రమ్‌సింఘే.. దేశంలోని వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచారు. ఇవాళ ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ…కేవలం ఒక రోజుకు సరిపడా పెట్రోల్ మాత్రమే స్టాకు ఉందని బాంబు పేల్చారు. అలాగే విద్యుత్‌ కోతలు భారీగా ఉంటాయని.. రోజుకు విద్యుత్‌ కోసం 15 గంటల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. రానున్న రోజులు మరింత గడ్డుగా ఉంటాయని ఆయన దేశ ప్రజలకు హెచ్చరించారు. చమురు దిగుమతికి తమ వద్ద తగిన డాలర్లు లేవని ఆయన అన్నారు. కొలంబో రేవు వద్ద మూడు చమురు ఓడలు సిద్ధంగా ఉన్నాయని.. వాటికి డాలర్లలో సొమ్ము ఇస్తేనే అన్‌లోడ్‌ చేస్తాయని ఆయన అన్నారు. రానున్న కొద్ది నెలలు మన జీవితంలో దుర్బరరోజులు కానున్నాయని ఆయన అన్నారు. నిజాన్ని దాచి, ప్రజలకు అబద్ధాలు చెప్పడం తనకు ఇష్టం లేదని రణిల్ విక్రమ్‌ సింఘే అన్నారు. మే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఆయన అన్నారు. తనకు ఇష్టం లేకపోయినా… ఉద్యోగుల జీతాలు, నిత్యావసర సేవల కోసం నోట్ల ప్రింటింగ్‌కు అనుమతించినట్లు ఆయన చెప్పారు. (ఇలా నోట్లు ప్రింట్‌ చేయడం వల్ల కరెన్సీ విలువ పడిపోతుంది)