For Money

Business News

గోల్డ్‌స్టోన్‌ చేతికి ఈక్విటాస్‌ టెక్

టెక్నాలజీ ఆధారిత లాజిస్టిక్‌ సొల్యూషన్లు, ఈ-కామర్స్‌ సేవలను అందిస్తున్న ఈక్విటాస్‌ టెక్నాలజీస్‌ను గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీస్‌ టేకోవర్‌ చేసింది. ఈక్విటాస్‌లో 51-100 శాతం వరకూ వాటాను కొనుగోలు చేయడానికి గోల్డ్‌స్టోన్‌ బోర్డు నిర్ణయించింది. వాటా కొనుగోలు తర్వాత ఈక్విటాస్‌ కంపెనీ గోల్డ్‌స్టోన్‌కు అనుబంధ కంపెనీగా మారుతుంది. ప్రస్తుతం ఈక్విటాస్‌ టెక్నాలజీస్‌కు చెందిన 99.62 శాతం వాటా ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ చేతిలో ఉంది. ఈక్విటాస్ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ ప్రమోట్‌ చేసింది.ఈక్విటాస్‌ టెక్నాలజీస్‌ చేతికి రావడం ద్వారా గోల్డ్‌స్టోన్‌ ఈ-కామర్స్‌, ఫిన్‌టెక్‌ కార్యకలాపాల్లోకి ప్రవేశించినట్లవుతుంది. లాజిస్టిక్‌ అగ్రిగేటర్‌ సేవలందిస్తున్న ఈక్విటాస్‌కు దక్షిణ భారతంలో 30,000 మంది రిజిస్టర్‌ యూజర్లు ఉన్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీస్‌ షేర్‌ రూ. 53.60 వద్ద ట్రేడవుతోంది.