For Money

Business News

నాస్‌డాక్‌ లాభాల స్వీకరణ

ఐటీ, టెక్‌ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. డాలర్‌ మళ్ళీ పెరుగుతోంది. డాలర్ ఇండెక్స్‌ 111ను దాటింది. అలాగే పదేళ్ళ ట్రెజరీ బాండ్స్‌ ఈల్డ్స్‌ కూడా పెరుగుతున్నాయి. ఎలాగూ ఎల్లుండి ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచుతోంది. ఈ నేపథ్యంలో టెక్‌, ఐటీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. దీంతో నాస్‌డాక్‌ ఒక శాతం, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 0.65 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అయితే డౌజోన్స్‌ మాత్రం క్రితం స్థాయి వద్దే ఉంటోంది. అందరికళ్ళూ ఫెడరల్‌ రిజర్వ్‌ ఎల్లుండి నిర్ణయంపైనే ఉన్నాయి. డాలర్ పెరగడంతో ఆటోమేటిగ్గా క్రూడ్‌ ధరలు తగ్గాయి. అలాగే బులియన్‌ ధరలు కూడా. ఫెడ్‌ నిర్ణయం తరవాత మార్కెట్‌ దశ, దిశపై ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.