For Money

Business News

కావేరీ సీడ్స్‌లో ఐటీ సోదాలు

నూజివీడు వంటి పలు రకాల ఆహార పంటల విత్తనాలను ఉత్పత్తి చేసే కావేరీ సీడ్స్‌ కంపెనీలో ఐటీ సోదాలు సాగుతున్నాయి. కంపెనీ ఆదాయం, ఆదాయపు పన్ను అంశాలకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి సంబంధించి కంపెనీకి రూ. 73.25 కోట్ల ఐటీ పన్ను కోసం డిమాండ్‌ నోటీసును ఐటీ విభాగం పంపింది. కంపెనీ వ్యవసాయ ఆదాయంపై క్లయిమ్‌ చేసిన పన్ను మినహాయింపును ఐటీ విభాగం వ్యతిరేకించింది. ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీన డీమాండ్‌ నోటీసు పంపింది. అయితే ఈ నోటీసుపై తాము అప్పీల్‌కు వెళతామని కావేరీ సీడ్స్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కావేరీ సీడ్స్‌పై సోదాలు నిర్వహిస్తున్నారు.