For Money

Business News

ట్విటర్‌లో శ్రీరామ్‌ కృష్ణన్‌ కీలక పాత్ర?

తన చేతికి వచ్చిన తరవాత ట్విటర్‌లో సమూల మార్పులకు ప్రయత్నిస్తున్నారు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌. భారత సంతతికి చెందిన సీఈఓ పరాగ్‌అగర్వాల్‌ను తొలగించిన మస్క్‌… ట్విటర్‌ పునర్‌ వ్యవస్థీకరణలో భారత సంతతికి చెందిన వ్యక్తి శ్రీరామ్‌ కృష్ణన్‌ సాయం తీసుకుంటున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 16z క్రిప్టోలో సాధారణ భాగస్వామి అయిన శ్రీరామ్‌.. ఇపుడు ట్విటర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన తాత్కాలికంగా మాత్రమే ఇక్కడ ఉంటారని తెలుస్తోంది. చెన్నైకు చెందిన శ్రీరామ్‌ కృష్ణన్‌ ట్విటర్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌లలో ప్రొడక్ట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ టీమ్‌లకు నేతృత్వం వహించారు.