For Money

Business News

ఒమైక్రాన్‌ రాకతో… కుప్పకూలిన వాల్‌స్ట్రీట్‌

రాత్రి మార్కెట్‌ ఓపెనింగ్‌ వాల్‌స్ట్రీట్‌లోని మూడు ప్రధాన షేర్ల సూచీలు 1.5 శాతంపైగా లాభాల్లో ఉన్నాయి. ఐటీ షేర్ల సూచీ నాస్‌డాక్‌ ఏకంగా 1.8 శాతం దాకా లాభపడింది. కాలిఫోర్నియాలో ఒమైక్రాన్‌ కేసు నమోదైందన్న వార్తలో ఒక్కసారిగా మార్కెట్‌లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. వెల్లువెత్తిన అమ్మకాలతో 1.8 శాతం లాభం నుంచి 1.83 శాతం నష్టాల్లో ముగిసింది నాస్‌డాక్‌. 1.5 శాతం లాభాల్లో ఉన్న డౌజోన్స్‌, ఎస్‌ అండ్ పీ 500 సూచీలు కూడా 1.25 శాతం వరకు నష్టపోయాయి. ఉదయం నుంచి యూఎస్‌ ఫ్యూచర్స్‌ కాస్త గ్రీన్‌లో ఉన్నాయి. ఒమైక్రాన్‌ దెబ్బకు డాలర్‌ కూడా స్వల్పంగా క్షీణించింది. నిన్న క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించాయి.