For Money

Business News

అమెరికాలో ఒమైక్రాన్‌

కరనా తాజా వేరియంట్‌ ఒమైక్రాన్‌ కేసు అమెరికాలో నమోదైంది. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తికి ఒమైక్రాన్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. నవంబర్‌ 22న అతను దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది. అతను రెండు వ్యాక్సిన్లు వేయించుకున్న వ్యక్తి అని పేర్కొంది. అతనికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, కోలుకుంటున్నట్లు సీడీసీ వెల్లడించింది.