For Money

Business News

20% తగ్గిన క్రూడ్‌… దోచుకుంటున్న కేంద్రం

ఒమైక్రాన్‌ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు భారీగా తగ్గాయి. డాలర్‌ కూడా బలహీనంగా ఉంది. నెల రోజుల్లో ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ ధర 83 డాలర్ల నుంచి 68 డాలర్లకు పడింది. కాని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు విషయమై నోరు మెదపడం లేదు. ఒమైక్రాన్‌ అనేక దేశాలకు విస్తరిస్తుండటంతో క్రూడ్‌ వినియోగం తగ్గుతుందనే వార్తలు వస్తున్నాయి. అలాగే అమెరికా కూడా తన రిజర్వ్‌ నిల్వల నుంచి 5 కోట్ల బ్యారెళ్ళను భారత్, చైనా వంటి దేశాలకు అమ్మింది. ఈ నేపథ్యంలో క్రూడ్‌ టెక్నికల్‌గా డౌన్‌ట్రెండ్‌లో ఉంది. ఒకవేళ ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని నియంత్రించినా… క్రూడ్‌ భారీగా పెరగడం అనుమానమేనని మార్కెట్‌ వర్గాలు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలను బట్టి రోజూ మారాల్సిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు… ఇలాంటి కీలక సమయంలో తగ్గించకపోవడం దుర్మార్గం. కేవలం పెట్రోల్‌, డీజిల్‌ ద్వారా లక్షల కోట్ల ఆదాయం వస్తుండటంతో… ప్రభుత్వం వీటి ధరలు తగ్గించేందుకు ఇష్టపడటం లేదు.