For Money

Business News

మోడీ మౌనం వీడాలి

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ జార్జ్ సోరోస్‌ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలకు ఇప్పటికైనా భారత ప్రధాని మోడీ నోరు విప్పాలని ఆయన అన్నారు. అదానీ వ్యవహారంతో భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారి తీయొచ్చని ఆయన అన్నారు. మ్యూనిచ్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో సోరోస్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అదానీ గ్రూప్‌ వ్యవహారంపై మాట్లాడారు. ‘మోడీకి, అదానీకి దగ్గరి సంబంధాలున్నాయని, హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ కష్టాల్లో పడిందని అన్నారు. దీని ప్రభావం భారత రాజకీయాలపై కూడా పడనుందని… మోడీ బలహీన పడే అవకాశముందని ఆయన అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని మోడీ మౌనంగా ఉంటున్నారంటూ ఆయన విమర్శలు చేశారు.