For Money

Business News

లాభాలన్నీ కోల్పోయిన నిఫ్టి

ఉదయం ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా సదరు లాభాలను కోల్పోయింది. ముఖ్యంగా మిడ్‌సెషన్‌ తరవాత నిఫ్టిపై ఒత్తిడి పెరిగింది. ప్రపంచ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా మన మార్కెట్‌లో మాత్రం అధిక స్థాయిలో ఒత్తిడి వచ్చింది. ఇవాళ వీక్లీ సెటిల్‌మెంట్‌ కూడా ఉండటం ఒక కారణం. ఉదయం 18134 పాయింట్లను తాకిన నిఫ్టి ఒకదశలో 18000ని తాకింది. తరవాత స్వల్పంగా కోలుకుని 18035 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 35 పాయింట్లు లాభపడింది. అదానీ షేర్లలో అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఇవాళ ఒక శాతం లాభంతో ముగిసింది. ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌ఏఎల్‌, ఎంఫసిస్‌ వంటి షేర్లు భారీ లాభాలు పొందడంతో నిఫ్టి నెక్ట్స్‌ ఇవాళ 0.72 శాతం లాభంతో ముగిసింది. అయితే ఎప్పటిలాగే నిఫ్టి నెక్ట్స్‌లో ఉన్న అదానీ టోటల్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు అయిదు శాతం నష్టంతో లోయర్‌ సీలింగ్‌ వద్ద క్లోజ్‌ కాగా, అదానీ గ్రీన్‌ స్వల్ప లాభంతో క్లోజైంది. మిడ్‌ క్యాప్‌ షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టిలో స్వల్ప ఒత్తిడి వచ్చింది. వీక్లీ సెటిల్‌మెంట్‌ కారణంగా నిఫ్టి దాఆపు స్థిరంగా ముగిసినా… మిడ్‌ క్యాప్‌తో పాటు ద్వితీయ శ్రేణి షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి.