For Money

Business News

మీడియా షేర్లకు భారీ డిమాండ్‌

ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో అనలిస్టులు ప్రాధాన్యం ఇస్తున్న రంగాల్లో మీడియా ఒకటి. ఈ రంగానికి చెందిన పలు షేర్లను అనలిస్టులు రెకమెండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన నెట్‌వర్క్‌ 18 కంపెనీ షేర్‌ను కొనమని సలహా ఇస్తున్నారు. త్వరలోనే ఈ కంపెనీ రీరేటింగ్‌ ఉంటుందని భావిస్తున్నారు. ఇవాళ ఉదయం రూ. 91.20 వద్ద ప్రారంభమైన ఈ షేర్‌కు రోజంతా మద్దతు లభించింది. ఈ కంపెనీని రిలయన్స్‌ పునర్‌ వ్యవస్థీకరిస్తుందని సమాచారం. దీంతో ఇవాళ నిఫ్టి 300 పాయింట్లకు పైగా క్షీణించినా.. ఈ షేర్‌ పది శాతం సీలింగ్‌తో రూ. 103.90 వద్ద ముగిసింది. అంతకుమునుపు ఈ షేర్‌ రూ.105.85ని తాకింది. ఇదే గ్రూప్‌నకు చెందిన టీవీ బ్రాడ్‌కాస్ట్‌ 18 కూడా గ్రీన్‌లో ముగిసింది. ఎన్‌డీటీవీ షేర్‌ 5 శాతం అప్పర్‌ సీలింగ్‌తో ముగిసింది. అలాగే BAG షేర్‌ కూడా 5 శాతం లాభంతో ముగిసింది.