For Money

Business News

300 పాయింట్లు డౌన్‌… ముంచిందెవరు?

మార్కెట్‌ భారీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. ఇవాళ యూరప్‌ మార్కెట్లకు సెలవు కావడంతో నిఫ్టి డైరెక్షన్‌ లెస్‌గా మారింది. గత గురువారం భారీ నష్టాలతో ముగిసిన వాల్‌స్ట్రీట్‌ ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో మన మార్కెట్‌లో ప్రతి దశలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌ ప్రభావం మార్కెట్‌పై తీవ్రంగా ఉంది. ఉదయం నుంచి HDFC ట్విన్స్ కాస్త స్థిరంగా ఉన్నట్లు కన్పించినా… అవి కూడా భారీగా నష్టపోవడంతో నిఫ్టిపై ఒత్తిడి తీవ్రమైంది. ఎందుకంటే ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌కు నిఫ్టిలో వెయిటేజి అధికంగా ఉంది. నిఫ్టి ఒకదశలో 17067ని తాకినా క్లోజింగ్‌లో స్వల్పంగా కోలుకుని 17173 వద్ద ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ ఒక్కటే 0.36 శాతం నష్టంతో ముగిసింది. మిగిలిన సూచీలన్నీ భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టి, నిఫ్టి మిడ్‌ క్యాప్‌, నిఫ్టి బ్యాంక్‌ సూచీలు 1.7 శాతం నుంచి 2 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో సమ్మర్‌ ఎఫెక్ట్‌ ఎన్‌టీపీసీ 6 శాతంపైగా పెరిగింది. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.