For Money

Business News

నిర్మాణాలపై రూ. 3800 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణాల కోసం రూ.3800 కోట్లు వెచ్చించనున్నట్లు మాక్రోటెక్ డెవలపర్స్‌ (లోధా) వెల్లడించింది. గత ఏడాది మార్కెట్‌ నుంచి ఈ కంపెనీ రూ. 2500 కోట్ల సమీకరించిన విషయం తెలిసిందే. వచ్చే మార్చికల్లా 10,000 ఇళ్ళను డెలివరీ ఇస్తామని కంపెనీ అంటోంది. ప్రస్తుత ప్రాజెక్టులను శరవేగంతో పూర్తి చేయడంత పాటు భారీ సంఖ్యలో కొత్త ప్రాజెక్టులను చేపట్టనుండటంతో నిర్మాణ ఖర్చు భారీగా పెరగనుందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ అభిషేక్ లోధా అన్నారు. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాజెక్టుపై కంపెనీ అధికంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది రూ.9024 కోట్ల అమ్మకాల బుకింగ్‌ చేసిన ఈ కంపెనీ ఈ ఏడాది 27 శాతం అధికంగా రూ.11500 కోట్ల బుకింగ్స్‌ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. 2020-21లో కేవలం రూ. 40.16 కోట్ల నికర లాభం ఆర్జించిన ఈ కంపెనీ 2021-22లో రూ. 1202 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా రూ. 5771 కోట్ల నుంచి రూ. 8579 కోట్లకు పెరిగింది. 2021-22లో రూ.15000 కోట్ల గ్రాస్‌ డెవలప్‌మెంట్‌ వ్యాల్యూ (జీడీవీ) గల 11 జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్స్‌ చేసినట్లు అభిషేక్‌ లోధా తెలిపారు.