For Money

Business News

వైజాగ్‌లో రూ. 1750 కోట్లతో కైనటిక్‌ ప్లాంట్‌

వైజాగ్‌లో రూ. 1,750 కోట్లతో ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటుచేసేందుకు కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ యజమాని, సీఈవో సులజ ఫిరోదియా మొత్వాని, కో–ఫౌండర్‌ రితేష్‌ మంత్రి కలిశారు. వైజాగ్‌లో బ్రాండెడ్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు వీరు ఆసక్తి కనబర్చారు.  అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను కూడా కైనెటిక్‌ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పూణె సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నెలకు 6,000 ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ కంపెనీకి ప్లాంట్‌ ఉంది. కంపెనీ ప్రణాళికలను ముఖ్యమంత్రికి కైనటిక్‌ బృందం చర్చించింది.