For Money

Business News

టాటాలకే ఎయిర్‌ ఇండియా

ఎయిర్‌ ఇండియా ఊహించినట్లే టాటాల చేతికి వెళ్ళింది. ఇవాళ జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఎయిర్‌ ఇండియాకు వచ్చిన బిడ్లను పరిశీలించారు. ఎయిర్‌ ఇండియా కోసం టాటా గ్రూప్‌ మాతృసంస్థ టాటా సన్స్‌ వేసిన బిడ్‌ అత్యధికంగా ఉందని తేలింది. టాటా సన్స్‌ బిడ్‌కు హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని కమిటీ ఆమోద ముద్ర వేసిందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.