For Money

Business News

ఐఎస్‌బీ… అందుకే బాబు విజనరీ

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇవాళ ఐఎస్‌బీలో జరిగే గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు అవుతున్నారు. 2022 బ్యాచ్‌ విద్యార్థులతో ఆయన ముఖాముఖి మాట్లాడుతారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీని హైదరాబాద్‌కు తేవడమే గాక.. ఆ సంస్థకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించిన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు కృషి టీడీపీ గుర్తు చేసింది. 20వ వార్షికోత్సవం సందర్భంగా ‘అందుకే చంద్రబాబు’ను విజనరీ అంటారంటూ ఐఎస్‌బీ రాక ముందు ఆ ప్రాంతపు ఫొటోను, ఇప్పటి ఫొటోను తెలుగుదేశం పార్టీ ట్వీట్‌ చేసింది. తొలుత ఐఎస్‌బీని ముంబైలో పెట్టాలని ప్రతిపాదించారు. చంద్రబాబు చొరవ చూపడంతో ఇతర రాష్ట్రాలు పోటీ పడ్డాయి. దీంతో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ప్రత్యేక విమానంలో రెండు రోజుల్లో ఆసక్తి చూపిన నగరాలలో పర్యటించారు.చంద్రబాబు ఆఫర్‌ను అంగీకరించి ఐఎస్‌బీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఐఎస్‌బీకి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అంచలంచెలుగా ఎదిగన ఐఎస్‌బీ ఇవాళ ప్రపంచంలోని ప్రముఖ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది.