For Money

Business News

మిడ్‌ సెషన్‌లో మార్కెట్‌కు ఊపు

ఉదయం వంద పాయింట్ల లాభంతో ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌ సెషన్‌ కల్లా రెండు వందల పాయింట్లకు పైగా నష్టపోయింది. 15903 పాయింట్లను తాకిన నిఫ్టి 12.30 గంటల నుంచి ఒక్కసారిగా పుంజుకుంది.ఒక గంటలో 200 పాయింట్లకుపైగా కోలుకుని ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 16154 పాయింట్లను తాకింది. గత కొన్ని రోజులుగా డల్‌గా ఉన్న స్టీల్‌ షేర్లు ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌తో పాటు యాక్సిస్‌ బ్యాంక్ ఆకర్షణీయ లాభాలు గడించాయి. అన్నింటికన్నా అధికంగా బ్యాంక్‌ నిఫ్టి భారీగా లాభపడింది. చాలా షేర్లు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఫలితాలు బాగుండటంతో టొరెంట్ ఫార్మా పది శాతంపైగా పెరిగింది. ఇవాళ అదానీ గ్రూప్‌ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. అదానీ ఎనర్జి, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ ఎంటర్‌ప్రైజస్‌, అదానీ విల్మర్‌ నష్టాల్లో ఉండటం విశేషం.