For Money

Business News

అంచనాలకు మించి…ఫలితాలు

సెప్టెంబర్‌ నెలతో ముగిసి మూడు నెలల్లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మార్కెట్‌ అంచనాలకు మించిన పనితీరు కనబర్చింది. ఈ మూడు నెలల కాలంలో బ్యాంక్‌ రూ. 4302 కోట్ల నికర వడ్డీ ఆదాయంపై రూ. 1787 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర వడ్డీ ఆదాయం 18 శాతం పెరగ్గా, నికర లాభం 60 శాతం పెరిగింది. ఈడీ నౌ ఛానల్‌ నిర్వహించిన సర్వేలో అనలిస్టులు బ్యాంక్‌ నికర లాభం రూ. 1730 కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. నికర లాభం మార్కెట్‌ అంచనాలను మించగా, నికర వడ్డీ ఆదాయం మాత్రం అంచనాలకు తగ్గట్లుగానే ఉంది. ఈ త్రైమాసికంలో ఎన్‌పీఏలకు ప్రావిజన్స్‌ తగ్గాయి. నికర ఎన్‌పీఏ శాతం 0.8 శాతం నుంచి 0.61 శాతానికి తగ్గింది. బ్యాంక్‌ ఆపరేటింగ్‌ లాభం 11 శాతం పెరిగి రూ. 2653 కోట్ల నుంచి రూ. 3519 కోట్లకు చేరింది.