For Money

Business News

స్వల్ప నష్టాల్లో వాల్‌స్ట్రీట్‌

నెట్‌ఫ్లిక్స్‌ అనూహ్య ఫలితాలతో ఉదయం ఒక శాతం వరకు లాభాల్లో అమెరికా ఫ్యూచర్స్‌… సరిగ్గా ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి నష్టాల్లోకి జారిపోయాయి. డౌజోన్స్‌ దాదాపు క్రితం స్థాయి వద్దే ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌డాక్‌ సూచీలు మాత్రం అర శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. అంతకుమునుపు యూరో మార్కెట్లు కూడా లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా మార్కెట్లను మొన్నటి దాకా డాలర్‌ గడగడలాడించగా… ఇపుడు బాండ్‌ ఈల్డ్స్‌ ఈక్విటీ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ఇవాళ కూడా పదేళ్ళ అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ రెండు శాతంపైగా పెరిగి 4.1 శాతం వద్ద ట్రేడవుతున్నాయి. మరోవైపు డాలర్‌ కూడా 0.71 శాతం పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ నుంచి బాండ్లవైపు మళ్ళుతున్నారు. జనవరి నుంచి అమెరికాలో మాంద్యం ఖాయమని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. మరోవైపు క్రూడ్‌ కూడా స్వల్పంగా కోలుకుంది. బ్రెంట్‌ క్రూడ్‌ 90 డాలర్లపైన ఉంది.