For Money

Business News

పిరమల్‌ ఫార్మా లిస్టింగ్‌…కొనేవారు లేరు

పిరమల్ ఎంటర్‌ప్రైజస్‌ డీమర్జర్‌లో భాగంగా పిరమల్‌ ఫార్మాను కొత్తగా కంపెనీగా విడగొట్టిన విషయం తెలిసిందే. పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌ వాటాదారుల వద్ద ఉన్న ప్రతి ఒక షేర్‌కు నాలుగు పిరమల్‌ ఫార్మా షేర్లు కేటాయించారు. పిరమల్‌ ఫార్మా షేర్‌ ముఖవిలువ రూ.10. డీమర్జర్‌ తరవాత పిరమల్‌ ఫార్మా షేర్లు ఇవాళ రూ. 200 వద్ద లిస్ట్‌ అయ్యాయి. ట్రేడ్‌ టు ట్రేడ్‌ విభాగంలో ఈ షేర్‌ లిస్టయింది. లిస్టయిన వెంటనే ఈ షేర్‌ 5 శాతం క్షీణించింది.ప్రస్తుతం రూ. 190కి పడిపోయింది. ఈ షేర్‌ వద్ద కొనుగోలుదారులు లేరు. మరోవైపు పరిమల్‌ ఎంటర్‌ప్రైజస్‌ షేర్‌ రూ. 825 వద్ద ముగిసింది.