For Money

Business News

షియోమి ఆస్తుల జప్తు సక్రమమే

ఈ ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ షియోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రూ. 5551.27 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఈ తీసుకున్న చర్యలను ఫెమా కాంపిటెంట్‌ అథారిటీ సమర్థించింది. నిజానికి ఈడీ జప్తును సవాలు చేస్తూ షియోమి కర్ణాటక హైకోర్టును ఈ ఏడాది జులై5న ఆశ్రయించింది. అయితే కంపెనీ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసిందని ఈడీ పేర్కొంది. రాయల్టీ ముసుగులో భారీ మొత్తాన్ని కంపెనీ చైనాకు తరలించిందని ఈడీ అంటోంది. 2014లో షియోమి భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటి నుంచి షియోమి గ్రూప్‌లోభాగమైన మూడు కంపెనీలకు రూ.5551.27 కోట్లను రాయల్టీ ముసుగులో తరలించిందని ఈడీ పేర్కొంది. దీంతో దానికి సమానమైన మొత్తాన్ని ఈడీ జప్తు చేసింది. ఈడీ తీసుకున్న చర్యలను ఫెమా చట్టం కింద ఏర్పాటైన కాంపిటెంట్‌ అథారిటీ ఆమోదం తెలిపినట్లు ఈడీ పేర్కొంది.