For Money

Business News

బ్యాంకు షేర్ల అండతో…

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ధోరణితో మన మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. క్రెడిట్‌ పాలసీ ప్రకటన వరకు నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఆ తరవాత పుంజుకున్నాయి. యూరో ఫ్యూచర్స్‌తో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ ఆకర్షణీయ లాభాల్లో ఉండటంతో మన మార్కెట్లు పాజిటివ్‌గా ముందుకు సాగాయి. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు ఒక శాతంపైగా లాభపడటంతో… బ్యాంకు షేర్లు మరింత పుంజుకున్నాయి. బ్రిటన్‌ గ్రోత్‌ రేటు అనూహ్యంగా పాజిటివ్‌గా రావడంతో సెంటిమెంట్‌ మరింత మెరుగుపడింది. దాదాపు అన్ని యూరో మార్కెట్లు ఒక శాతం లాభంతో ఉన్నాయి. మరోవైపు అమెరికా ఫ్యూచర్స్‌ కూడా ఒక శాతం లాభంతో ఉండటంతో నిఫ్టి17094 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 276 పాయింట్లు పెరిగింది. మార్కెట్‌ రెండో మద్దతు స్థాయి నుంచి కోలుకుని… 200 రోజుల చలన సగటును దాటి ముందుకు సాగడంతో టెక్నికల్‌ కాస్త ఊరట లభించింది. మార్కెట్‌ ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి నుంచి గట్టి మద్దతు లభించింది. ఈ సూచీ 2.6 శాతంపైగా లాభపడింది. నిఫ్టి నెక్ట్స్‌ ఒక శాతం, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 1.93 శాతం లాభంతో ముగిశాయి. నిఫ్టిలో హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ ఇండ్‌ టాప్‌ త్రీగా ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్‌గా నిలిచిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ 0.82 శాతం నష్టపోయింది. నష్టాలన్నీ చాలా స్వల్పంగా ఉన్నాయి. మొత్తానికి అక్టోబర్‌ డెరివేటవ్‌ సిరీస్‌ పాజిటివ్‌గా ప్రారంభం కావడం విశేషం.