For Money

Business News

పెరగనున్న సీఎన్‌జీ, పీఎన్‌జీ ధర

ఇక ఉత్తరాదితో నగరాలతో పాటు పైప్‌ల ద్వారా గ్యాస్‌ పొందే గృహాలకు సరఫరా చేసే గ్యాస్ (పీఎన్‌జీ) మరింత భారం కానుంది. అలాగే గ్యాస్‌ ఆధారంగా నడిచే కార్లు, ట్యాక్సీలు కూడా సీఎన్‌జీ కోసం అధిక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి మార్చి నెలాఖరు వరకు నేచురల్‌ గ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం 40 శాతం పెంచింది. నేచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తిదారులకు ఒక ఎంబీటీయూ (million British thermal units) ధరను 6.1 డాలర్‌ నుంచి 8.57 డాలర్లకు పెంచింది. అదే రిలయన్స్‌ వంటి కొత్త, క్లిష్టమైన బావుల నుంచి గ్యాస్‌ ఉత్పత్తిచేసే కంపెనీలకు చెల్లించే ధరను 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెంచింది. ఇలా నేచురల్‌ గ్యాస్‌ ధర 40 శాతం పెరగడంతో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను కూడా ఆయా కంపెనీలు త్వరలోనే పెంచనున్నాయి. అలాగే గ్యాస్‌ ద్వారా విద్యుత్‌ తయారు చేసే కంపెనీలకు కూడా ఉత్పత్తి వ్యయం పెరగనుంది. వీటన్నింటితో పాటు ఎరువుల కర్మాగారాలు కూడా గ్యాస్‌ను అధికంగా ఉపయోగిస్తాయి. అంటే ఇక ఎరువుల ధరలు కూడా బాగా పెరగనున్నాయన్నమాట.