For Money

Business News

పేటీఎం ఐపీఓ ఆపాలంటూ పిటీషన్‌

పేటీఎం త్వరలోనే స్టాక్‌ మార్కెట్‌ నుంచి దాదాపు రూ. 15,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అనూహ్యంగా ఐపీఓకు అనుమతి ఇవ్వొద్దంటూ అశోక్‌ కుమార్‌ సక్సేనా అనే వ్యక్తికి సెబీకి లేఖ రాశారు. తాను కంపెనీ మాజీ డైరెక్టర్‌ అని, 20 ఏళ్ళ క్రితం తాను కంపెనీ స్థాపించేందుకు 27,500 డాలర్లు పెట్టుబడి పెట్టానని.. తనకు ఇంత వరకు ఎలాంటి షేర్లు ఇవ్వలేదని ఆయన ఆరోపించారని రాయిటర్స్‌ వార్త సంస్థ ఓ వార్త రాసింది. అయితే దీన్ని పేటీఎం ఖండిస్తోంది. తమను వేధించడానికి సక్సేనా అలా చేస్తున్నాడని, దీనికి సంబంధించి తాము న్యూఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెబుతోంది. ఐపీఓ ప్రాస్పెక్టస్‌లో ‘క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌’కాలమ్‌ కింద ఈ కేసు గురించి పొందుపర్చామని పేటీఎం అంటోంది. ఈ ఆరోపణలను సక్సేనా ఖండిస్తున్నారు. పేటీఎం చాలా పెద్ద కంపెనీ అని, తాను సాధారణ వ్యక్తినని… తాను ఎలా వేధిస్తానని ఆయన ప్రశ్నిస్తున్నారు. తను వాదన రేపు కోర్టులో నిరూపణ అయితే ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతారని ఆయన అంటున్నారు.