రీబాక్‌ను అమ్మేసిన ఆదిదాస్

జర్మనీ స్పోర్ట్స్ వేర్ కంపెనీ ఆదిదాస్ ఎట్టకేలకు రీబాక్ బ్రాండ్‌ను అమ్మేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రాండ్‌ను వొదిలించుకునేందుకు ఆదిదాస్ ప్రయత్నిస్తోంది. అమెరికాకు చెందిన అథింటిక్ బ్రాండ్స్ గ్రూప్ (ఏబీజీ)కి 210 కోట్లకు విక్రయించింది. రీబాక్ వల్ల ఆర్థికంగా కంపెనీకి పెద్ద ప్రయోజనం లేకపోవడంతో సదరు బ్రాండ్‌ను అమ్మేసి… పూర్తిగా తన సొంత బ్రాండ్‌పై దృష్టి పెట్టాలని ఆదిదాస్ భావిస్తోంది. నైక్‌తో పోటీ పడేందుకు 2006లో 380 కోట్ల డాలర్లకు ఈ బ్రాండ్‌ను ఆదిదాస్ కొనుగోలు చేసింది. దాదాపు 14 ఏళ్ళ తరవాత 210 కోట్ల డాలర్లకు వొదిలించుకుంది.