For Money

Business News

మీ బండిని ఇలా ఈవీగా మార్చుకోవచ్చు

ఎలక్ట్రిక్‌ వాహనం కొనడం ఖరీదైన వ్యవహారం అనుకునేవారు తమ బైక్‌ను ఎలక్ట్రిక్‌ వాహనంగా లేదా హైబ్రిడ్‌ వాహనంగా మార్చుకోవచ్చు. దీనినే రిట్రో ఫిట్టింగ్‌ అంటారు. దీనికి అవసరమైన కన్వర్షన్‌ కిట్స్‌ను ఇపుడు దేశ వ్యాప్తంగా అనేక కంపెనీలు అందిస్తున్నాయి. ముఖ్యంగా గోగొఏ1 కంపెనీ మోటర్‌బైక్స్‌కు ఇలాంటి కన్వర్షన్‌ కిట్‌లను అమ్ముతోంది. ఈనెలలోనే మరిన్ని టూ వీలర్‌, త్రివీలర్‌ మోడల్స్‌కు కన్వర్షన్‌ కిట్‌లను ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. తరవాత ఫోర్‌ వీలర్స్‌కు, కమర్షియల్‌ వెహికల్స్‌కు కూడా ఇలాంటి కన్వర్షన్‌ కిట్‌లను అందిస్తామని అంటోంది. దీనికి సంబంధించి సీఎన్‌బీసీ టీవీ18 ప్రత్యేక కథనం అందింది. ఈ గొగొఏ1 కంపెనీ కన్వర్షన్‌ కిట్స్‌కు ఆర్‌టీవీ ఆమోదం కూడా ఉంది. టూ వీలర్‌ వాహననాన్ని ఎలక్ట్రిక్‌ వాహనంగా మార్చుకోవడం కోసం రూ. 27,000 నుంచి రూ. 30,000 దాకా ఖర్చు అవుతుంది. బౌన్స్‌ అనే కంపెనీ 100 సీసీ పాత స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌ వాహనం మార్చడం కోసం రూ. 27,000 చార్జి చేస్తుంది. మరో రూ. 45,000 బ్యాటరీ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే స్వాపబుల్‌ బ్యాటరీ కోసమైతే రూ. 27,000 ఖర్చవుతుంది. అలా కాకుండా ఫిక్సెడ్‌ బ్యాటరీ కావాలంటే రూ. 70,000 అవుతుంది. జుంక్‌ అనే కంపెనీ కూడా పెట్రోల్‌ స్కూటర్స్‌ను ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌గా మార్చుతుంది. ఈ కంపెనీకి బెంగళూరులో 150 బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌ ఉన్నాయి కూడా. రెట్రోఫిట్టింగ్‌ కూడా రెండు విధాలు ఉంటుంది. గొగొఏ1 కంపెనీ అందించే కిట్‌లలో ఒకటి… ఎకనామిక్‌ మ్యాచింగ్‌ కిట్‌. ఈ కిట్‌ ఖరీదు రూ. 18,000 నుంచి రూ. 20,000 దాకా ఖర్చవుతుంది. ఈ కిట్‌ వల్ల వాహనానికి ఇపుడున్న పవర్‌ కన్నా తక్కువగా ఉంటుంది. మరోటి రూ. 37,700 ఖర్చయ్యే కిట్‌. దీనివల్ల వాహనానికి ఇపుడు ఎంత పవర్‌ ఉందో అంతే పవర్‌తో ఈవీ పనిచేస్తుంది.