For Money

Business News

డౌన్‌ట్రెండ్‌ మోడ్‌లో బిట్‌కాయిన్‌

రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన వెంటనే క్రిప్టో కరెన్సీలు.. సదరు లాభాలను క్రమంగా కోల్పోయాయి. రష్యా కరెన్సీలో క్రిప్టో కరెన్సీల వ్యాల్యూమ్‌ బాగా పడిపోయింది. దీంతో క్రిప్టోకరెన్సీలలో మళ్ళీ డౌన్‌ట్రెండ్‌ మొదలైంది. గతవారం 45000 డాలర్లకు చేరిన బిట్‌కాయిన్‌ క్రమంగా క్షీణిస్తూ అన్ని సపోర్ట్‌ లెవల్స్‌ కోల్పోయింది. 39,464 గతవారం ప్రధాన సపోర్ట్‌ లెవల్‌ కాగా, ఇవాళ 38,911 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఆరంభఃలో 38199 స్థాయిని కూడా తాకింది. టెక్నికల్‌గా చూస్తే బిట్‌కాయిన్‌ తదుపరి మద్దతు స్థాయి 36000 డాలర్లని అనలిస్టులు అంటున్నారు. ఈ స్థాయిలో గట్టి రికవరీ వస్తే మళ్ళీ 45000 డాలర్లను టచ్‌ చేసే అవకాశముందని భావిస్తున్నారు. అధిక స్థాయిలో బిట్‌కాయిన్‌ 45000 స్థాయి వద్ద ఒత్తిడి రావడం ఇటీవల రెండోసారి. ఇతర క్రిప్టో కరెన్సీల్లో కూడా ఇదే ట్రెండ్‌ కన్పిస్తోంది. ఎథీరియం 2639 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బీఎన్‌బీ 379 డాలర్లకు పడగా, యూఎస్‌డీ కాయిన్‌ మాత్రం 0.999 వద్దే చాలా పటిష్ఠంగా ట్రేడవుతోంది. ఇక మన కరెన్సీలో క్రిప్టోవిలువ చూస్తే.. బిట్‌కాయిన్‌ రూ. 31,13,000 వద్ద ట్రేడవుతోంది. ఏథర్‌ 2,11,298 వద్ద ఉంది. BAT రూ. 52 పాలిగాన్‌ రూ.118, లైట్‌ కాయిన్‌ రూ. 8,250 వద్ద ట్రేడవుతోంది. ఇంకా EOS రూ.168.49 వద్ద, XRP రూ.58.83 వద్ద ట్రేడవుతున్నాయి.