క్రూడ్ ఆయిల్ @78 డాలర్లు
డాలర్ పెరిగినా క్రూడ్ ఆయిల్ పరుగు ఆగడం లేదు. భారత్ వంటి వర్ధమాన దేశాలకు మరింత ఇబ్బందులు తప్పేలా లావు. ఇవాళ కూడా డాలర్ ఇండెక్స్ 0.27 శాతం పెరగడంతో 93.27కు చేరింది. సాధారణంగా డాలర్ పెరిగితే పడాల్సిన క్రూడ్ ఇవాళ 0.9 శాతం పెరిగి 78 డాలర్లకు చేరింది. వరుసగా మూడో వారం క్రూడ్ లాభాలతో ముగుస్తోంది. మరోవైపు డాలర్ పెరిగితే పడాల్సిన బులియన్ స్థిరంగా ఉండటం విశేషం. వెండి ఒక శాతం క్షీణించినా… బంగారం మాత్రం స్థిరంగా ఉంది. అమెరికా మార్కెట్‌లో ఔన్స్ బంగారం 1752 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.