For Money

Business News

ఒక రోజు ముందుగానే అమెజాన్‌ సేల్‌

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ను ఒక రోజు ముందుగానే అంటే అక్టోబరు 3 నుంచే ప్రారంభించబోతున్నట్లు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. ఇంతకుముందు ప్రకటించిన తేదీల ప్రకారం అక్టోబరు 4 నుంచి ఈ ఫెస్టివల్ ప్రారంభం కావాల్సి ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ సేల్‌ మాత్రం ఒక రోజు ముందే ప్రారంభమౌతుంది. పైగా వీటికి ఆఫర్స్‌ భిన్నంగా ఉంటాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అమెజాన్‌ వెల్లడించింది. ఇదేవిధంగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ కూడా అక్టోబరు 7-12 తేదీలకు బదులు 3-10 తేదీల్లో జరగనుంది. గతేడాది పండుగ సీజన్‌లో ఇ-కామర్స్‌ దిగ్గజాల 740 కోట్ల డాలర్ల వ్యాపారం చేయగా, ఈ ఏడాది 900 కోట్ల డాలర్ల మేర జరగొచ్చని భావిస్తున్నారు.