For Money

Business News

ఐపీఓ కోసం 30 కంపెనీల క్యూ

క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. ఐపీఓ ద్వారా వచ్చే 2 నెలల్లో రూ.45,000 కోట్లకు పైగా నిధుల్ని సమీకరించేందుకు 30కిపైగా కంపెనీలు రెడీ అవుతున్నట్లు మర్చంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. టెక్నాలజీ కంపెనీలే అధికంగా ఉన్నాయి. జొమాటో తరవాత కొత్త తరం ఇన్వెస్టర్లు భారీగా స్టాక్‌ మార్కెట్‌లో నిధులు పెడుతున్నాయిరు. అక్టోబరు-నవంబరులో పబ్లిక్‌ ఇష్యూలకు రాబోతున్న కంపెనీల్లో పాలసీబజార్‌ (రూ.6,017 కోట్లు), ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ (రూ.4,500 కోట్లు), నైకా (రూ.4,000 కోట్లు), సీఎంఎస్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ (రూ.2,000 కోట్లు), మొబిక్విక్‌ సిస్టమ్స్‌ (రూ.1,900 కోట్లు), నార్తర్న్‌ ఆర్క్‌ క్యాపిటల్‌ (రూ.1,800 కోట్లు), ఇక్సిగో (రూ.1,600 కోట్లు), సఫైర్‌ ఫుడ్స్‌ (రూ.1,500 కోట్లు), ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (రూ.1,330 కోట్లు), స్టెరిలైట్‌ పవర్‌ (రూ.1,250 కోట్లు), రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌ (రూ.1,200 కోట్లు), సుప్రియా లైఫ్‌సైన్స్‌ (రూ.1,200 కోట్లు) .. ఇంకా అనేక కంపెనీలు రెడీ అవుతున్నాయి. భారీ స్థాయిలో నిధుల సమీకరణకు ఐపీఓ మార్కెట్‌ సరైన వేదికగా చాలా కంపెనీలు భావిస్తున్నాయి. అనేక కంపెనీలు బ్యాంకు రుణాలతో విస్తరణ చేపట్టడం కన్నా.. ఈక్వీటీ మార్గమే సులువుగా భావిస్తున్నాయి. పలు కంపెనీలు రుణాలు తిరిగి చెల్లించేందుకు క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు), దేశీయ మదుపర్లు స్టాక్‌ మార్కెట్లలో గత ఏడాదిగా విపరీతంగా నిధులు డుతుండటంతో… కంపెనీలు కూడా ఎక్కువ ప్రీమియంతో మార్కెట్‌లోకి వస్తున్నాయి.