For Money

Business News

కార్వీ కేసులో రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్‌

బ్యాంకులకు రుణాల ఎగ్గొట్టడంతో పాటు నిధుల దారి మళ్లించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (KSBL)కు చెందిన రూ.700 కోట్ల విలువైన షేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఫ్రీజ్‌ చేసింది. KSBL సీఎండీ సి. పార్థసారథి, ఆయన కుమారులు రజత్‌ పార్థసారథి, అధిరాజ్‌ పార్థసారథిలు రూ.2,873 కోట్లకు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ పేర్కొంది. ఇతర వ్యక్తుల ద్వారా తన కంపెనీల్లోని వాటాలను అమ్మేందుకు పార్థసారథి ప్రయత్నిస్తున్నారని తమకు తెలిసిందని, దాంతో రూ.700 కోట్ల విలువైన షేర్లను జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది. తమ దగ్గర ఖాతాలు తెరచి బిజినెస్‌ చేస్తున్న ఇన్వెస్టర్ల షేర్లను నిబంధలనుకు విరుద్ధంగా బ్యాంకుల వద్ద తాకట్టుపెట్టి రుణాలు పొందారని ఈడీ పేర్కొంది. ఇలా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి రూ.329 కోట్లు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ నుంచి రూ.137 కోట్లు, ఐసీసీఐసీ బ్యాంక్‌ నుంచి రూ.562 కోట్ల రుణం తీసుకున్నట్లు ఆయన బ్యాంకులే ఫిర్యాదు చేశాయి.