For Money

Business News

అపుడు బాబ్రి… ఇపుడు ఔరంగజేబ్‌ సమాధి

మొగల్‌ రాజు ఔరంగజేబ్‌ సమాధిని నామరూపాలు లేకుండా చేయడానికి డేట్‌ ఫిక్స్‌ అయిందని, అయితే బయటకు చెప్పడం లేదని మహారాష్ట్ర మంత్రి నితేష్‌ రాణె వెల్లడించారు. డెడ్‌లైన్‌ గురించి సీఎం ఫడ్నవీస్‌కు తెలుసుని, ఖుల్దాబాద్‌లోని ఔరంగ్‌జేబ్‌ సమాధి ధ్వంసానికి సీఎం అనుమతి ఉందని ఆయన అన్నారు. ముంబైలోని శంభాజినగర్‌లో ఆయన మాట్లాడుతూ… ఔరంగ్‌ జేబ్‌ సమాధి ధ్వంసాన్ని తాము జిహాదీ కార్యక్రమంగా భావిస్తామని అన్నారు. ఔరంగ్‌జేబ్‌ వంటి వ్యక్తుల పేర్లు తమ రాష్ట్ర పేరుతో ముడిపడి ఉండటాన్ని తాము ఏమాత్రం సహించమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చెత్త తమ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదన్నారు. ఔరంగజేబ్‌ సమాధాన్ని తొలగించాలని 2025 మార్చిలో కూడా రాణె డిమాండ్‌ చేశారు. సమాధి తొలగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని, దాన్ని కూల్చిన తరవాతే జర్నలిస్టులకు తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సమాధి పురావస్తు శాఖకు చెందిన ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ASI) పర్యవేక్షణలోఉంది. సమాధి తొలగింపుపై ఒక అంగీకారం కుదిరినందున… చట్టానికి లోబడే ఔరంగజేబ్‌ సమాధిని తొలగిస్తామని ఫడ్నవీస్‌ అన్నారు.

Leave a Reply