For Money

Business News

కుప్పకూలిన AI షేర్లు

భయపడినంతా జరుగుతోంది. ఏఐ షేర్ల వ్యాల్యుయేషన్స్‌ పిచ్చి పట్టినట్లు పెరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వాదనలు ఇపుడు నిమౌతున్నాయి. క్యాష్ బదులు.. రుణ సాధనాలు, బాండ్ల రూపంలో లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్న ఏఐ కంపెనీల వాల్యుయేషన్స్‌పై ఇపుడు ఆందోళన వ్యక్తమౌతోంది. ముఖ్యంగా తమ ఏఐ కంపెనీల వ్యాల్యుయేషన్స్‌ తగ్గించడంలో చైనా సఫలం కావడంతో… ఇపుడు వాల్‌స్ట్రీట్‌ పునరాలోచనలో పడింది. రాత్రి ఏఐ రంగానికి చెందిన పలు కంపెనీల షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. మొన్న గూగుల్‌, రాత్రి ఇంటెల్‌ భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా రాత్రి ఇంటెల్‌ షేర్‌ ఏకంగా 30 శాతం క్షీణించింది. 1974 తరవాత ఈ స్థాయిలో షేర్‌ పడటం ఇదే మొదటిసారి. అంచనాల మేరకు కంపెనీ ఫలితాలు లేకపోవడమే దీనికి కారణం. దీంతో ఇతర ఏఐ రంగ షేర్లు కూడా భారీగా క్షీణించాయి. సాన్‌డిస్క్‌, ఏఎండీ షేర్లు పది శాతంపైగా పడగా, ఎన్‌విడియా, మైక్రాన్‌ షేర్లు అయిదు శాతంపైగా పడ్డాయి. అమెజాన్‌, యాపిల్‌ షేర్లు కూడా రాత్రి నష్టాల్లో క్లోజయ్యాయి. రాత్రి నాస్‌డాక్‌ 2.86 శాతం పడగా, డౌజోన్స్‌ 1 శాతం పైగా క్షీణించింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 1.82 శాతం తగ్గింది. అయితే కంపెనీలు మాత్రం పెట్టుబడి అంచనాలను ఏమాత్రం తగ్గించడం లేదు. మైక్రాసాఫ్ట్‌ కూడా తన అంచనాలను కొనసాగించాలని నిర్ణయించింది.

Leave a Reply