For Money

Business News

క్రూడ్‌ ఆయిల్‌ భారీ పతనం

చాలా రోజుల తరవాత ఒకే రోజు క్రూడ్‌ ఆయిల్‌ 9 శాతంపైగా క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ ఒకే రోజు 1.5 శాతం పైగా పెరిగింది డాలర్‌. అనూహ్యం ఒకే రోజు ఈ స్థాయిలో డాలర్‌ పెరగడంతో ఇతర కరెన్సీలు దారునంగా దెబ్బతిన్నాయి. చాలా వరకు యూరో కరెన్సీలు రెండు లేదా మూడు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయాయి. దీనికి కారణం మాంద్యం భయాలే. ఈనెలలోనే ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేట్లను పెంచనుంది.దీంతో వృద్ధి స్పీడు తగ్గడం అటుంచి… మైనస్‌లో వెళుతుందన్న వార్తలు వస్తున్నాయి. మెజారిటీ ఆర్థికవేత్తలు వృద్ధి రేట్లు మైనస్‌కు వెళ్ళదని అంటున్నా … వృద్ధి మాత్రం అంతంత మాత్రమే ఉంటుందని అంగీకరిస్తున్నారు. దీంతో క్రూడ్‌ ఇవాళ 9 శాతంపైగా క్షీణించింది. అమెరికా మార్కెట్లలో విక్రయించే WTI క్రూడ్‌ 7 శాతంపైగా నష్టపోవడంతో వంద డాలర్లకు పడింది. ఇక ఆసియా దేశాలు కొనే బ్రెంట్‌ క్రూడ్‌ ధర 9 శాతంపైగా క్షీణించి 104 డాలర్లకు చేరింది. అయినా అమ్మకాల ఒత్తిడి ఆగడం లేదు.