For Money

Business News

బులియన్‌ ఢమాల్‌!

నిన్నటి దాకా జిగేల్‌ మన్న బులియన్‌ ఇవాళ డమాల్‌ అంది. అంతర్జాతీయ మార్కెట్‌ డాలర్‌ పట్టపగ్గాల్లేకుండా పెరుగుతోంది. అంటే రూపాయి విలువ మరింత క్షీణిస్తోందన్నమాట. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. దీంతో మన మార్కెట్‌లో డబుల్‌ ఎఫెక్ట్‌ కన్పిస్తోంది.స్పాట్‌ మార్కెట్‌లో పెద్ద పతనం లేకున్నా ఫ్యూచర్స్‌ మార్కెట్‌ బంగారం, వెండిలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి వస్తోంది. స్టాండర్డ్‌ బంగారం పది గ్రాముల ఆగస్టు కాంట్రాక్ట్‌ రూ. 665 క్షీణించి రూ. 51457 వద్ద ట్రేడవుతోంది. ఇక కిలో వెండి రూ.1312 క్షీణించి రూ.57,176కి క్షీణించింది. ఇది సెప్టెంబర్‌ డెలివరీకి సంబంధించిన కాంట్రాక్ట్‌. ఆగస్టు కాంట్రాక్ట్‌ కూడా రూ. 1220 నష్టపోయింది. ఇక ఇతర మెటల్స్‌ విషయానికొస్తే జింక్‌ మూడు శాతం, కాపర్‌, అల్యూమినియం రేట్లు కూడా రెండు శాతంపైగా క్షీణించాయి.
1800 డాలర్ల దిగువకు
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర మళ్ళీ 1800 డాలర్ల దిగువకు వచ్చింది. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో 1.7 శాతం నష్టంతో 1767 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి 2.67 శాతం నష్టంతో 19.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.