For Money

Business News

‘ఇందూ’పై కన్నేసి బుక్కయ్యారు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న ఇందూ ప్రాజెక్ట్స్‌ ఇపుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది. బ్యాంకులకు దాదాపు రూ. 3000 కోట్లు ఎగ్గొట్టింది ఈ కంపెనీ. ఇతర అప్పులు కలిపి మొత్తం రూ. 4500 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ దివాలా తీయడంతో రుణదాతలు హైదరాబాద్‌లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యూనల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించారు. మరో మార్గం లేకపోవడంతో ఈ కంపెనీని వేలం వేసేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. లిక్విడేషన్‌ ప్రక్రియలో భాగంగా ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌తో పాటు కె రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కన్సార్టియం రూ. 600 కోట్లకు కంపెనీని తీసుకునేందుకు ముందుకు వచ్చింది. రూ. 5 కోట్ల అడ్వాన్స్‌ కూడా ఇచ్చింది. రుణదాతలు దీనికి అంగీకరించడంతో..వేలానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. కాని గడువులోగా మిగిలిన సొమ్ము చెల్లించడంలో కన్సార్టియం విఫలమైంది. మిగిలిన సొమ్ము చెల్లించేందుకు మరింత గడువు ఇవ్వాలని కోరగా… ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… కన్సార్టియం కంపెనీలపై క్రిమినల్‌ కేసు పెట్టాల్సిందిగా ఆదేశించింది. ఇందూను ఎవరు టచ్‌ చేసినా కేసులు తప్పేలా లేదు.