For Money

Business News

టెలికాం సేవలూ ‘వినియోగ’ సేవలే

టెలికాం కంపెనీల సేవలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. టెలికాం కంపెనీలు అందించే సేవల లోపాలు కూడా వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తాయని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సేవల లోపాలపై వినియోగదారులు 1885 నాటి ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం కింద మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించాలా? లేక వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాలా? అనేది పూర్తిగా వినియోగదారుల ఇష్టమని స్పష్టం చేసింది. అజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి వొడాఫోన్‌పై దాఖలు చేసిన పిటీషన్‌పై కోర్టు తీర్పు ఇచ్చింది. వినియోగదారుల రక్షణ చట్టం, 1986 టెలికాం సేవా లోపాలకు వర్తించదన్న వొడాఫోన్‌ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ చట్టంలో పేర్కొ న్న సేవా లోపాలు ‘టెలికాం’ సేవా లోపాలకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది. తొలుత అగర్వాల్‌ అహ్మదాబాద్‌లోని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార ఫోరమ్‌లోపిటీషన్‌ వేశారు. ఆయన వాదనను ఫోరమ్‌ సమర్థించింది. తరవత గుజరాత్‌ రాష్ట్ర ప్రబుత్వం, నేషనల్‌ కన్జూమర్‌ డిస్‌ప్యూట్స్‌ రెడ్రెస్‌ల్‌ కమిషన్‌ కూడా సమర్థించింది. అయితే వీటి సవాలు చేస్తూ వోడాఫోన్‌ కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టెలిఫోన్‌ కంపెనీలను టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్సన్‌ 7బి కింద పరిగణించరాదని వాదించింది. అయితే సుప్రీం కోర్టు కంపెనీ వాదనను కొట్టిపారేసింది.