For Money

Business News

మెరిసిన బులియన్‌ ధరలు

దిగువస్థాయలో బులియన్‌కు గట్టి మద్దతు లభించింది. అమెరికా మార్కెట్‌లో ఈక్విటీ మార్కెట్లు పెరగడం, డాలర్‌ క్షీణించడం బులియన్‌కు బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా ఈక్విటీలు పెరగడంతో సిల్వర్‌కు మంచి డిమాండ్‌ లభించనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి 3 శాతంపైగా పెరిగింది. ప్రస్తుతం ఔన్స్‌ బంగారం 1669 డాలర్లు, వెండి 18.70 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక మన దేశీయ మార్కెట్‌లో కూడా బులియన్‌ బాగానే పెరిగింది. ఫార్వర్డ్‌ మార్కెట్‌ ఎంసీఎక్స్‌లో పది గ్రామల స్టాండర్డ్‌ బంగారం డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ ధర రూ.353 పెరిగి రూ. 50613 వద్ద ట్రేడవుతోంది. ఇక కిలో వెండి డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ ధర రూ.1095 పెరిగి రూ. 56321 వద్ద ట్రేడవుతోంది. అయితే స్పాట్‌ మార్కెట్‌లో ఇవాళ ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ. 40 తగ్గి రూ.50,833కి చేరింది. అదే వెండి రూ.594 తగ్గి రూ. 56,225కు చేరింది. ఈ ధరలు ఇవాళ సాయంత్రంనాటివి. రేపు ఉదయం తాజా రేట్లు ఉంటాయి.