For Money

Business News

వాల్‌స్ట్రీట్‌లో భారీ ర్యాలీ

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా కార్పొరేషన్‌ ఫలితాలు ఇవాళ వాల్‌స్ట్రీట్‌లో భారీ ర్యాలీని తెచ్చాయి. గత కొన్ని రోజులుగా ఫైనాన్సియల్స్‌లో ఒక మోస్తరు ర్యాలీ కన్పిస్తోంది. ఇవాళ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఫలితాలు మరింత ధృడపడింది. డాలర్‌ ఇండెక్స్‌ భారీగా క్షీణించడం… నాస్‌డాక్‌కు మరింత కలిసి వచ్చింది. ఇటీవల బాగా క్షీణించిన పలు ఐటీ, టెక్‌ షేర్లకు దిగువ స్థాయిలో గట్టి మద్దతు లభిస్తోంది. నాస్‌డాక్‌ ప్రస్తుతం 3.46 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 2.75 శాతం, డౌజోన్స్‌ 1.84 శాతం లాభంతో ట్రేడవతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ ఒకటిన్నర శాతం లాభం ఉన్న సమయంలో యూరో మార్కెట్లు సుమారు పాటి లాభాలతో ఉన్నాయి. అయితే వాల్‌స్ట్రీట్‌ ఓపెనింగ్‌లోనే భారీగా పుంజుకోవడంతో యూరో మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 1.79 శాతం లాభంతో ముగిసింది.