For Money

Business News

డిసెంబర్‌లో టెస్లా ఐఫోన్‌

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ప్రవేశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన అధికారికంగా ప్రకటించకున్నా… పలు టెక్‌ వెబ్‌సైట్లు ఈ ఫోన్‌ గురించి లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ ఇస్తున్నాయి. డిసెంబర్‌ నెలలో ఈ ఫోన్‌ను ఎలాన్‌ మస్క్‌ మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇందులో 120 రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నట్లు The TechOutlook అనే వెబ్‌సైట్‌ పేర్కొంది. దీనికి ఒలియోఫోబిక్‌ కోటింగ్‌తో స్క్రాచ్‌ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో ఉండే ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలుంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 70 వేల నుంచి రూ. 80 వేల మధ్య ఉండొచ్చని అంటున్నారు. బ్లాక్‌ కలర్‌లో వచ్చే ఈ ఫోన్‌ బరువు 240 గ్రాములు ఉంటుందని అంటున్నారు.