వాల్‌స్ట్రీట్‌లో కొనసాగుతున్న ర్యాలీ

ఫెడ్ రిజర్వ్ పాలసీని మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసింది. వడ్డీ రేట్లపై ఇంకా అస్పష్టత ఉన్నా.. ఉద్దీపన ప్యాకేజీకి మద్దతు నవంబర్ నుంచి తగ్గిస్తుందనే వార్తలకు మార్కెట్ స్పందించినట్లు విశ్లేషకులు అంటున్నారు. ట్రేడింగ్ తరవాత ఫెడ్ నిర్ణయాలు వెలువడుతాయి. మరీ నెగిటివ్ అయితే తప్ప.. మార్కెట్ సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. దీంతో వాల్ స్ట్రీట్లో సూచీలన్నీ ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. డౌజోన్స్ రికార్డు స్థాయిలో 1.63 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.4 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్ కూడా ఒక శాతం లాభంతో ఉంది.