For Money

Business News

హైదరాబాద్‌ నుంచి స్పుత్నిక్‌ లైట్‌ ఎగుమతి?

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ లైట్‌ టీకాను హైదరాబాద్‌ నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ టీకాను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, హెటెరొ కంపెనీ తయారు చేస్తున్నారు. దేశీయంగా ఈ టీకాల వినియోగానికి అనుమతి లేదు. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే 20 లక్షల డోసుల తయారు చేసినట్లు తెలుస్తోంది. సింగిల్‌ డోస్‌ టీకా అయిన స్పుత్నిక్‌ లైట్‌ ఎగుమతికి కేంద్రం అనుమతి ఇవ్వొచ్చని… ఈనెలలో ఎగుమతులు ప్రారంభం కావొచ్చని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది.