For Money

Business News

డాలర్‌ ఢమాల్‌… క్రూడ్‌ హుషార్‌

ఇటీవల ఆర్జించిన లాభాలన్నింటిని డాలర్‌ ఈ ఒక్కరోజే కోల్పోయింది. తాజా సమాచారం మేరకు డాలర్‌ ఇండెక్స్ 0.46 శాతం నష్టంతో 93 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌ బలహీనపడటంతో క్రూడ్‌ ఆయిల్‌కు ఎదురేలేదు. పైగా అమెరికా క్రూడ్‌ నిల్వలు తగ్గడం, అమెరికా ఆర్థిక గణాంకాలు చాలా పాజిటివ్‌గా ఉండటంతో ఆయిల్‌ డిమాండ్‌ పెరిగింది. తాజా సమాచారం మేరకు ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 77.3 డాలర్లను దాటింది. అయితే డాలర్‌ తగ్గినా బులియన్‌ మార్కెట్‌ రెడ్‌లో ఉండటం విశేషం. బంగారం 1.6 శాతం క్షీణించగా, వెండి మాత్రం ఒక శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి.