For Money

Business News

భారత్‌ పే ఎండీ రాజీనామా

గత కొన్ని రోజులు మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన భారత్‌ పే ఎండీ ఆష్నీర్‌ గ్రోవర్‌ వ్యవహారానికి తెరపడింది. భారత్‌పే ఎండీ, డైరెక్టర్‌గా ఆయన రాజీనామా చేశారు. ఆయన భార్య మాధురి జైన్‌ కూడా కొన్ని రోజుల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆష్నీర్‌ గ్రోవర్‌ రాజీనామా వార్తను సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌ ధృవీకరించింది. నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై మాధురి జైన్‌ రాజీనామా చేశారు. ఇదే తరహా ఆరోపణలు ఆష్నిర్‌ గ్రోవర్‌పై కూడా వస్తున్నాయి. ఇప్పటి భారత్‌ పే ఖాతాల ఆడిటింగ్‌, గవర్నర్స్‌ అంశాలపై విచారణ జరుగుతోంది. కంపెనీ బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లో దావా వేశారు. అయితే అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆయన రాజీనామా చేస్తూ బోర్డుకు లేఖ రాశారు. 2022 ఆరంభం నుంచి తనపై, తన కుటుంబంపై కొందరు గిట్టని వ్యక్తులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను నెలకొల్పిన కంపెనీకి తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు బాలా బాధపడుతున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఆసక్తి ఉంటే భారత్‌పే వ్యవహారంలో ఏం జరిగిందో… ఆకాశ్‌ బెనర్జి షో ‘ద దేశ్‌భక్త్‌’లో చూడండి.