For Money

Business News

అయోమయంలో అమెరికా మార్కెట్లు

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో స్టాక్‌ మార్కెట్‌తోపాటు ఇతర మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగానే.. రష్యాపై అనేక దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడంతో… వాటితో లింక్‌ ఉన్న అనేక కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. రాత్రి భారీ లాభాలతో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్‌… క్రమంగా లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. ఇటీవల మార్కెట్‌ల తీరు చూస్తే మాత్రం… ఒక మోస్తరు నష్టాలతో రాత్రి వాల్‌స్ట్రీట్‌ ముగిసింది. నాస్‌డాక్‌ స్వల్ప లాభంతో అంటే 0.4 శాతం లాభంతో క్లోజైంది. కాని ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.25 శాతం, డౌజోన్స్‌ 0.5 శాతం నష్టంతో ముగిశాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్ ఇంకా బలపడుతూనే ఉంది. ఇదే ట్రెండ్‌ కొనసాగితే ఇవాళ రాత్రికి డాలర్‌ ఇండెక్స్‌ 97 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే కాపర్‌ మినహా అన్ని కమాడిటీస్‌ ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 101 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం కూడా 1900 డాలర్లపైనే ఉంటోంది. అమెరికా ఫ్యూచర్స్‌ నామ మాత్రపు నష్టాల్లో ఉన్నాయి.