For Money

Business News

భారత్‌పే ఎండీ భార్య ఔట్‌

ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీ భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అష్నీర్‌ గ్రోవర్‌ భార్య మాధురి జైన్‌ను కంపెనీ నుంచి తొలగించారు. పలు ఆర్థిక అవకతవకలకు ఆమె పాల్పడ్డారన్న ఆరోపణపై కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మాధురి జైన్‌ ఇపుడు కంపెనీ కంట్రోల్స్‌ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ సొమ్మును బ్యూటీ ట్రీట్‌మెంట్లు, విదేశీ టూర్లకు ఖర్చుచేసి, నకిలీ ఇన్‌వాయిస్‌లు సమర్పించారని కంపెనీ ప్రధానంగా ఆరోపిస్తోంది. అలాగే మాధురి జైన్‌కు కేటాయించిన ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్లను కూడా రద్దు పర్చినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో కొద్దిరోజుల క్రితమే అష్నీర్‌ గ్రోవర్‌ను కంపెనీ బోర్డు మూడు నెలల సెలవుపై పంపించింది. ఎంప్లాయ్‌మెంట్‌ అగ్రిమెంట్‌ ప్రకారం మాధురి జైన్‌ గ్రోవర్‌ సర్వీసుల్ని ఫిబ్రవరి 22న టెర్మినెట్‌ చేసినట్టు కంపెనీ ప్రతినిధి వివరించారు.