For Money

Business News

100 స్టోర్లు దాటిన డికాక్షన్‌

టీ, కాఫీ వంటి పానీయాల విక్రయ సంస్థ డికాక్షన్‌..తెలుగు రాష్ర్టాల్లో తనదైన ముద్రవేసింది. ప్రారంభించిన ఏడాదిన్నరలోపే 100 కేంద్రాల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం తెలంగాణతోపాటు ఏపీల్లోని 25 నగరాల్లో ప్రాంచైజ్‌ పద్ధతిన 110 స్టోర్లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ ఫౌండర్‌ సంతోషి తెలిపారు. మరో 25 స్టోర్లను ఏర్పాటు చేయడానికి ఔత్సాహికులతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఒక్క హైదరాబాద్‌లోనే 70 కేంద్రాలను ఏర్పాటు చేసిన సంస్థ.. ఒక్కో స్టోర్‌తో గరిష్ఠంగా 5 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు.