క్రిప్టో యాడ్స్‌కు కళ్ళెం
క్రిప్టో కరెన్సీల అడ్వర్టైజ్మెంట్ల కోసం కొత్త మార్గదర్శకాలు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) తీసుకు వచ్చింది. వీటికి సంబంధించి దేశంలో ఇపుడు ఎలాంటి చట్టం లేదు. అయినా ఇటీవల క్రిప్టో ఆదాయంపై పన్నులను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే యాడ్స్ తాము ఎలాంటి నిషేధం విధించడం లేదని పేర్కొంది. దీంతో వీటి యాడ్స్ కోసం పకడ్బందీగా కొత్త మార్గదర్శకాలను తయారు చేశారు. తాజాగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో యాడ్స్‌కు మార్గదర్శకాలను ASCI విడుదల చేసింది. క్రిప్టో లేదా నాన్-ఫంగిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ) వంటి అన్ని వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ) ఉత్పత్తులు, సేవలకు సంబంధించి ప్రచార ప్రకటనలు ఏప్రిల్ 1 నుంచి ఈ విధంగానే ఉండాలంటూ ఈ సందర్భంగా పలు సూచనలు చేసింది. ‘అన్‌రెగ్యులేటెడ్, రిస్క్ ఎక్కువ’ అన్న డిస్ క్లయిమర్ యాడ్స్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందేనని ASCI పేర్కొంది. పత్రికల్లో ఈ హెచ్చరిక స్పష్టంగా ముద్రించాలని, టెలివిజన్లలోనైతే యాడ్ చివరకు వాయిస్‌ఓవర్‌లో వేగంగా కాకుండా నెమ్మదిగానే చెప్పించాలని చూడాలని కిప్ట్రో ఇండస్ట్రీకి ASCI తెలిపింది. అలాగే ప్రకటన నిడివి ఆధారంగా వీడియా యాడ్స్‌లో కనిష్ఠంగా 5 సెకండ్లు, గరిష్ఠంగా 2 నిమిషాలు ఈ హెచ్చరిక ఉండాలని ప్రకటనకర్తలకు సూచించింది. ఆడియో, సోషల్ మీడియా పోస్టులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నది. ప్రధానంగా ఇన్వెస్టర్లను తప్పు దోవ పట్టించేలా యాడ్స్ ఉండరాదని హెచ్చరించింది. ఈ యాడ్స్‌లో నటించే సెలబ్రిటీలు కూడా నిబంధనలు పాటించాల్సిందేనన్నది.