దీపావళి బోనస్‌పై ట్యాక్స్ తప్పదు
ఉద్యోగులకు తమ కంపెనీ ఇచ్చే దీపావళి బోనస్‌పై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా వస్తువుల రూపేణా.. చివరికి కంపెనీ సొంత వస్తువులు ఇచ్చినా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వస్తువులైతే ఏడాదికి రూ. 4999 వరకు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఆ పరిమితి దాటితే పన్ను చెల్లించాల్సిందే. ఒక ఏడాది మొత్తం మీద కంపెనీ నుంచి ఉద్యోగి రూ. 4999 మించి బోనస్ తీసుకుంటే పన్ను చెల్లించాల్సిందే. అదే నగదు రూపంలో ఒక్క రూపాయైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను విషయంలో నగదును, ఇతర వస్తు రూపేణా బోనస్‌ను విడిగా ఐటీ అధికారులు చూస్తారు. దీపావళి పండుగ కోసమే కాదు.. ఏడాది మధ్యలో పుట్టిన రోజు, వార్షికోత్సవాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల సమయంలో ఇచ్చేవాటికి కూడా పన్ను ఉంటుంది. గిఫ్ట్ కార్డులు కూడా దీనికి మినహాయింపు కాదు.