For Money

Business News

అప్పుల్లో 25 శాతం వడ్డీలకే

ఆంధ్రప్రదేశ్‌ తెస్తున్న కొత్త అప్పుల్లో వడ్డీ కోసమే 25 శాతం చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో ఏపీ ప్రభుత్వం రూ .58.111.85 కోట్లను రుణాలుగా సమీకరించగా, వడ్డీల కింద రూ. 15,291 కోట్లు చెల్లించిందని కాగ్‌ వెల్లడించింది. భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు రావడంతో ప్రభుత్వం బతికి పోయింది. వివిధ పద్దుల కింద రాష్ట్ర ఆదాయం 9 నెలల్లో రూ.69,943 కోట్లు కాగా, కేంద్రం నుంచి రూ.25,246 కోట్లు వచ్చాయి. అయినా రాష్ట్ర బడ్జెట్‌లో రెవెన్యూలోటు 918 శాతం పెరిగింది. ఇది కేవలం 9 నెలలకే. వాస్తవానికి పూర్తి ఏడాదికి రెవెన్యూ లోటు రూ. 5000 కోట్లు ఉంటుందని అంచనా వేయగా 9 నెలలకే రూ. 45,907 కోట్లకు చేరింది. ఇంకా మూడు నెలలు ఉంది.చూస్తుంటే రెవెన్యూ లోటు 1,000 శాతం దాటేలా ఉంది. ఆదాయం తగ్గిందని ప్రభుత్వం గగ్గోలు పెడుతున్నా… తాజా పరిస్థితి చూస్తుంటే పరవాలేదనిపిస్తోంది. ఏటా బడ్జెట్‌ అంచనాల్లో 90 శాతం సాధించడం కష్టం. కాని 9 నెలల్లోనే 70 శాతం సాధించింది. కాని రెవెన్యూ ఆదాయమే బాగా తగ్గుతోంది. 9 నెలల్లో బడ్జెట్‌ అంచనాల్లో 55 శాతమే సాధించింది. 9 నెలలకే కీలక జీఎస్టీ, రిజిస్ట్రేష్టేషన్‌ చార్జీలు, సేల్స్ ట్యాక్స్‌, ఎక్సైజ్‌ ఆదాయం 60 శాతం నుంచి 70 శాతం ఉంది. మిగిలిన మూడు నెలల ఆదాయం ఇదే స్థాయలో కొనసాగినా రాష్ట్ర ఆదాయం పరవాలేదనిపిస్తోంది. కేంద్రం నుంచి గ్రాంట్‌లు భారీగా వస్తాయని అంచనా వేయడం వల్లే అంచనాలను అందుకోవడం కష్టంగా ఉంది. అవి కూడా 50 శాతం దాటడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 57930 కోట్ల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వస్తుందని అంచనా వేయగా రూ. 25,246 కోట్లు వచ్చింది. సొంతంగా రాష్ట్రంలో ఆదాయం పెంచుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో  రెవెన్యూ లోటు పెరుగుతోంది. బడ్జెట్‌ అంచనాల్లో 70 శాతం చేరడానికి కారణం భారీ అప్పులు తేవడమే. రాష్ట్ర ఖర్చులకు అనుగుణంగా ఆదాయం పెంచుకోవడంలో ప్రభుత్వం విఫలమౌతోంది.